
(శ్రీరామ్ చక్రీ న్యూస్) జూన్ 11:బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని
మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని 60వ డివిజన్లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి నిల్వ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించారు.
డివిజన్ పరిధిలోని విశాల్ మార్ట్ పరిసరాలు, చందనం చెరువు ఎస్వైఆర్ (SYR) కన్వెన్షన్ సమీప ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోతున్న పాయింట్లను పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టనున్నారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
