అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
