అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. పాలనలో పూర్తిగా విఫలమైందని, రేవంత్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి రగులుతున్నదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ధ్వజమెత్తారు

బీఆర్ఎస్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదులో కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని, పార్టీపై ప్రేమ ఉండి పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి సభ్యత్వం అందించాలని సూచించారు. సభ్యత్వ నమోదుపై కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శ్వేత హోటల్లో మంగళవారం కరీంనగర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
