
జనవరి :18 (శ్రీరామ్ చక్రి న్యూస్) జాగో భాగ్యనగర్ – చలో బాలాపూర్ నినాదంతో 24న సభ
జాగో భాగ్యనగర్ – చలో బాలాపూర్ కార్యక్రమంలో భాగంగా, 2026 జనవరి 24వ తేదీ (శనివారం) సాయంత్రం 2.30 గంటలకు బాలాపూర్లో నిర్వహించనున్న ధర్మ రక్షణ సభకు బాలాపూర్ అఖిలపక్షం పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ, బాలాపూర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్నారని చెబుతున్న రోహింగ్యాలను గుర్తించి తిరిగి పంపాలని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించిన వారిని వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టాలని కోరారు.
ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలను కలిసి సమస్యలను విన్నవిస్తామని అఖిలపక్ష నేతలు తెలిపారు. ధర్మం, భద్రత, సామాజిక సమతుల్యత అంశాలపై చర్చించేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ధర్మ రక్షణ సభలో పలు సాధు సంతులు పాల్గొననున్నారని, అలాగే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలుపుతూ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.
ఈ సభను విజయవంతం చేయాలని గణేష్ సేన నాయకులు బాలాపూర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలను కోరారు.
