
జనవరి:18 (శ్రీరామ్ చక్రి న్యూస్) జిల్లెల గూడ శ్రీ మత్స్యవతార వెంకటేశ్వర స్వామి దేవాలయం గోశాలలోని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు సహకారంతో హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
అనంతరం అయ్యప్ప సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ, గోశాలలో ప్రతి అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో, శివ స్వాములు మరియు భక్తులు, కాలనీవాసులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. దాదాపు ప్రతి అమావాస్యకు వెయ్యి మందికి పైగా భక్తులు అన్నదానంలో పాల్గొంటున్నారని వెల్లడించారు.
అమావాస్య రోజున ఉదయం హోమ కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. “లోకా సమస్తా సుఖినోభవంతు – లోకమంతా సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి” అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సేవా సమితి సభ్యులు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, సహకరించిన భక్తులకు మరియు కాలనీవాసులకు జిల్లెలగూడ అయ్యప్ప సేవా సమితి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
