

ఫ్యూచర్ సిటీ సభకు కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీమహేశ్వరం, జూన్ 10 (శ్రీరామ్ చక్రి న్యూస్): ఫ్యూచర్ సిటీ బహిరంగ సభకు అల్మాస్గూడా నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాలుష్యం లేని పర్యావరణహిత ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో మహేశ్వరం నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని, యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
