గిరిజన ప్రాంతానికి మెరుగైన వైద్యసేవలు అందాయంటే.. అది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అని చెప్పుకోవాలి. కేవలం ఏరియా ఆసుపత్రితో సర్దుకునే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను తీసుకొచ్చి 500 పడకల మాతా, శిశు ఆసుపత్రితోపాటు సకల సౌకర్యాలతో సర్వజన ఆసుపత్రిని తీర్చిదిద్దారు.

భద్రాద్రి కొత్తగూడెం, మే 30 : గిరిజన ప్రాంతానికి మెరుగైన వైద్యసేవలు అందాయంటే.. అది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అని చెప్పుకోవాలి. కేవలం ఏరియా ఆసుపత్రితో సర్దుకునే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను తీసుకొచ్చి 500 పడకల మాతా, శిశు ఆసుపత్రితోపాటు సకల సౌకర్యాలతో సర్వజన ఆసుపత్రిని తీర్చిదిద్దారు. కానీ, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ సర్కారు కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం వైద్యులను నియమించుకోలేక చేతులెత్తేసింది. ఒక్కసారే 32 మంది వైద్యులు పై చదువుల కోసం వెళ్లగా.. సర్దుబాటు చేయలేక నానా తంటాలు పడుతున్నది.
