కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.నాలుగు వేల పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఎడపల్లి/నవీపేట, మే 30: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.నాలుగు వేల పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఎడపల్లిలో ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు పీఎఫ్ కట్ఆఫ్ డేట్ తొలగించి అర్హలందరికీ పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో శంకర్‌నాయక్‌కు అందజేశారు.
