భద్రకాళీ చెరువు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూడికతీత పనులు చేపట్టింది. అయితే అభివృద్ధి మాటేమో కానీ, చెరువు మాత్రం కబ్జాకు గురవుతున్నది. భద్రకాళీ చెరువుకు వరద వచ్చే భూముల్లో ప్లాట్లు చేసి పూడిక మట్టిని అక్కడికి తరలిస్తున్నారు

లోతట్టు ప్రాంతం కావడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద వచ్చి చేరుతున్నది. భద్రకాళీ చెరువు పూడిక మట్టిని ప్రతిరోజూ వందల టిప్పర్లలో ఇప్పుడు కబ్జా ప్లాట్లను ఎత్తుగా చేసేందుకు తరలిస్తున్నారు. అభివృద్ధి, సుందరీకరణ కోసం చేపట్టిన పూడికతీత పనులు ఆ చెరువు స్వరూపానికే ప్రమాదకరంగా మారుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పూడికమట్టి తరలిస్తున్నామని చెప్పుకుంటున్నారే తప్ప అది ఎవరు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనేది అధికారులు పట్టించుకోవడంలేదు.
