రాష్ట్రంలో కాంగ్రెస్‌ది రైతుల వ్యతిరేక ప్రభుత్వమని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు.

చింతకాని మండలంలోని ఒక్క గ్రామంలోనే 50 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వం కేవలం 22 వేల బస్తాలు మాత్రమే కొనుగోలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొక్కజొన్న రైతులు రోడ్లపై పంటను ఆరబెట్టుకొని వర్షానికి తడిసిపోతుంటే జిల్లా మంత్రులు ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు.
