యాసంగి పంట ఇంటికొచ్చింది.. వానకాలం పంటకు సాగు భూములు సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్న రైతులు యాసంగి పంట ఆనవాళ్లను ఆ భూములోనే వేసి కలియ దున్నాల్సిందిపోయి.. పంట అవశేషాలను పోగు చేసి నిప్పు పెడుతున్నారు

యాసంగి పంట ఇంటికొచ్చింది.. వానకాలం పంటకు సాగు భూములు సిద్ధం చేయడానికి సన్నద్ధమవుతున్న రైతులు యాసంగి పంట ఆనవాళ్లను ఆ భూములోనే వేసి కలియ దున్నాల్సిందిపోయి.. పంట అవశేషాలను పోగు చేసి నిప్పు పెడుతున్నారు. ఇలా నిప్పు పెట్టడం వల్ల అవశేషాలు కాలిపోవడంతోపాటు భూసారంపై ప్రభావం పడుతుంది. వేడికి భూమిలో ఉన్న క్రిమికీటకాలు, పంటకు శక్తినిచ్చే సారం దెబ్బతింటుంది. ఈ క్రమంలో తదుపరి సాగు చేసే పంటలకు భూమి శక్తిని ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం దిగుబడులపై పడుతుంది. వేసిన పంట ఎదుగుదల లేకపోవడం.. తరచూ తెగుళ్లు ఆశించడం వల్ల క్రిమిసంహారక మందులు, ఎరువులు చల్లడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది.
