ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా నల్లగొండ జిల్లా నందికొండ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

నందికొండ : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా నల్లగొండ జిల్లా నందికొండ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ -హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోలుస్తూ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయనపై నిరసనలు వెల్లువెత్తాయి
