ఒకవేళ ఇరాన్‌తో డీల్ కొలిక్కివస్తే, అప్పుడు సంతకాలు చేసేందుకు ఇస్లామాబాద్ వెళ్లనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్, అమెరికా మధ్య మొదటి దఫా శాంతి చర్చలు పాక్‌లో జరిగిన విషయం తెలిసిందే. యురేనియం అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు చెప్పారు.

వాషింగ్టన్: ఒకవేళ ఇరాన్‌తో ఫైనల్ డీల్ కుదిరితే, ఇస్లామాబాద్‌లో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు తాను కూడా వెళ్లనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్(Donald Trump) తెలిపారు. ఇరాన్‌తో దాదాపు అన్ని అంశాల్లో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. శుద్దీకరించిన యురేనియంను కూడా అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు ఆయన చెప్పారు. నెవడా, ఆరిజోనా రాష్ట్రాల పర్యటనకు వెళ్లే ముందు ఆయన వైట్‌హౌజ్ ఆవరణలో మీడియాతో మాట్లాఆరు. పాక్ నేతృత్వంలో సాగుతున్న దౌత్యపరమైన చర్చలు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సీజ్ఫైర్ ముగియకముందే ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ ఆ డీల్‌పై ఇస్లామాబాద్‌లో సంతకాలు చేయాల్సి వస్తే, తాను అక్కడకు వెళ్లే అవకాశం ఉంటుందని ట్ంరప్ తెలిపారు
