కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పులను చూసి దుఃఖిస్తున్నాడని పేర్కొన్నారు. రోజుల తరబడి వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కడి నుంచే అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, సివిల్ సప్లయ్ అధికారులకు ఫోన్ చేసి కొనుగోళ్లలో నెలకొన్న జాప్యంపై నిలదీశారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి లారీలను త్వరగా పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయం, కాంగ్రెస్ పాలనలో దండగగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నదని తెలిపారు. లారీలు అందుబాటులో లేవని, కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. లారీలు ఉన్న చోట సంచులు ఉండవని, సంచులు ఉన్న చోట లారీలు ఉండవన్నారు
