హైదరాబాద్ పాతబస్తీ సౌత్వెస్ట్ జోన్లో… కబేళా, సబ్జీ మండీలు ఎక్కువగా ఉండే ఏరియాలో అతనొక ఇన్స్పెక్టర్. తన స్టేషన్లో నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి వసూలుకు పాల్పడుతున్నారు

హైదరాబాద్ పాతబస్తీ సౌత్వెస్ట్ జోన్లో… కబేళా, సబ్జీ మండీలు ఎక్కువగా ఉండే ఏరియాలో అతనొక ఇన్స్పెక్టర్. తన స్టేషన్లో నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి వసూలుకు పాల్పడుతున్నారు. దుకాణదారులు, కాలనీ సంఘాలు ముడుపులు చెల్లించుకోకుంటే కేసులు, వేధింపులు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు పట్టుకుని వస్తే.. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, ఒక రేటు ఫిక్స్ చేస్తారని, పైసలివ్వకుంటే కేసు నమోదు చేయరని తెలిసింది. ఒక్కో నోటీసుకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
