: హాంగ్ కాంగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 128కి చేరుకున్నది.

హాంగ్‌కాంగ్: హాంగ్ కాంగ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 128కి చేరుకున్నది. ఆ టవర్స్‌లో మరికొంత మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. టవర్స్ వద్ద బాధితుల కోసం గాలింపు కొనసాగుతున్నదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా కార్యదర్శి క్రిస్ టాంగ్ తెలిపారు. వాంగ్ పుక్ కోర్టు కాంప్లెక్స్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం ఆ మంటల్ని ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు 79 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
