రహదారులకు అడ్డంగా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయడం చూస్తున్నాం. ఇకిప్పుడు టోల్ ప్లాజాలు ఉండవ్. నిర్ణీత ప్రదేశాల్లో రోడ్ల పైన ఏర్పాటు చేసిన కెమెరాలతో కూడిన ప్రత్యేక స్ట్రక్చర్లు ఆటోమేటిక్గా టోల్ వసూలు చేసుకుంటాయి.

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఇది మరో రకమైన మైలురాయి. ఫలితంగా రాబోయే ఐదు సంవత్సరాలలో జాతీయ రహదారులపై ‘అడ్డంకులు లేని’ టోల్ వసూళ్ల వ్యవస్థ సాకారమయ్యేందుకు ఇది ఇంకో ముందడుగు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్సిడియరీ సంస్థ అయిన జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (JPBL) ఈ తరహా కాంట్రాక్ట్ మరోసారి దక్కించుకుంది
