డిపార్ట్మెంట్లో లంచం తీసుకుంటే కఠినంగా ఉంటామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. కేసుల విషయంలో బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీని వాడాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్: పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు లేదని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) స్పష్టం చేశారు. సివిల్ వివాదాల కోసం సివిల్ కోర్టులు ఉన్నాయని వివరించారు. పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. యూనిఫాం, అవినీతి ఒకే దగ్గర ఉండవని తేల్చిచెప్పారు. ఒక్క పోలీస్ అధికారి కూడా లంచం తీసుకుంటే డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పుకొచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి.
