కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చు తండా, ఎస్వీకే తండా, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

కేసీఆర్ హయాంలో రైతులు రాజుల్లా బతికారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పెరిగాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ గారడీ మాటలేనని, ఎన్నికల సమయం లో ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమ లు చేశారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమర్‌సింగ్ తండాలో కాంగ్రెస్ 8వ వార్డు అభ్యర్థి ధరావత్ మౌనికాఉపేందర్, బేడ బుడగజంగాల సం ఘానికి చెందిన నాయకులు తూర్పాటి బైరాగి, పస్తం సమ్మయ్య, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన అంజయ్య, బీఆర్ఎస్ ఇన్చార్జి కుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
