ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, నెట్టెంపాడ్, ఆర్ఎల్ఐఎస్ లిప్టు – 2, ఎంజీకేఎల్ఐఎస్కు నీటి కేటాయింపులు జరుపుతూ తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మహమ్మద్ అంజద్ హుస్సేన్ జీవో విడుదల చేశారు.

2025 – 26 యాసంగి యాక్షన్ ప్లాన్లో భాగంగా నీటి కేటాయింపులు జరిపేందుకు ఈ నెల 3న హైదరాబాద్లోని ఎర్రమంజిల్లోని జలసౌధలో మొదటి ఎస్సీఐడబ్ల్యూఎం కమిటీలో యాసంగి సాగుకు అవసరమైన నీటి విడుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి జిల్లాల సీఈలు, ఎస్ఈలు, ఈఈలతో ఈఎన్సీ సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల ఆధారంగా ఏఏ రకాల పంటలకు సాగునీరు అందించగలమో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టు కింద 20,014 ఎకరాల ఆరుతడి, 6,910 ఎకరాల వరి, నెట్టెంపాడ్ ఎత్తిపోతల పత కం కింద 22,800ఎకరాల ఆరుతడి, ఆర్బీఎల్ఐఎస్ లిప్టు – 2 కింద 5,350 ఆరుతడి, 4,650 ఎకరాల వరి, ఎంజీకేఎల్ఐఎస్ కింద 28,739ఆరుతడి, 13,458ఎకరాల వరి పంటలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు.
