హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్, జూన్ 11: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపనపల్లిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ గేటు ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా.. అతడి వద్ద ఉన్న బ్యాగులో గంజాయిని గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి కేజీన్నర గంజాయిని, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బికాశ్ బైక్‌గా గుర్తించారు.
