భారత జట్టు విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మకు అభిమానగణం ఎక్కువే. వచ్చే వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న అభిమానాన్ని ఒక యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు.

భారత జట్టు విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ కు అభిమానగణం ఎక్కువే. తనమార్క్ షాట్లతో అలరించే హిట్మ్యాన్ భారీ సిక్సర్లు, ఫుల్షాట్లు కొడుతుంటే స్టేడియం దద్దరిల్లిపోవాల్సిందే. వచ్చే వన్డేప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాజీ సారథిపై తనకున్న అభిమానాన్ని ఒక యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు. ఏకంగా కొబ్బరి బోండంపై టీమిండియా స్టార్ బొమ్మను చాలా నేర్పుగా చెక్కాడు. ప్రస్తుతం ‘కోకోనట్ రోహిత్’ వీడియో నెట్టింట వైరలవుతోంది.
