కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు

హనుమకొండ, మే 27 : కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల వెన్ను విరుస్తున్నదన్నారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లిలోని ఎన్వీ కన్వెన్షన్‌లో 30 పైగా సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ డిపార్ట్మెంట్లో అధికారులకు కార్మిక సంఘాలు పలుమార్లు తమ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నా పరిషారం కావడం లేదన్నారు.
