అప్పులబాధ తో భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా లో ఖిల్లాఘణపురం మండలంలోని సల్కలాపూర్ గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద చోటుచేసుకున్నది.

ఖిల్లాఘణపురం, మే 27 : అప్పులబాధ తో భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా లో ఖిల్లాఘణపురం మండలంలోని సల్కలాపూర్ గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద చోటుచేసుకున్నది. స్థానికులు కథనం ప్రకారం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన గంగల నర్సింహులు (40) ఆరేండ్ల కిందట తన భార్య ఎల్ల మ్మ (36), కుమారుడు సాయి నిహాల్ (15), కూతురు సాహితీశ్రీ (13)తో కలిసి ఖిల్లాఘణపురం మండలంలో మామిడితోటలను లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తూ వచ్చాడు. వ్యాపారంలో రూ.60లక్షల నుంచి రూ.70లక్షలకు పైగా అప్పులు చేసినట్లు సమాచారం . కొన్ని అప్పులకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
