పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకం బస్సుల ఫిట్నెస్. కానీ కొన్ని పాఠశాలలు బస్సులను ఫిట్నెస్గా ఉంచడంతో నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

కామారెడ్డి, జూన్ 12 : పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకం బస్సుల ఫిట్నెస్. కానీ కొన్ని పాఠశాలలు బస్సులను ఫిట్నెస్గా ఉంచడంతో నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభకానున్నది. పాఠశాలలకు దూరంగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు చెందిన బస్సు, ఆటోల్లో పంపిస్తుంటారు. ఒక పాఠశాలలు విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై ఉన్న శ్రద్ధ వారు ప్రయాణించే బస్సులపై లేకపోవడం గమనార్హం. జిల్లాలో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తక్కువ ధరకు బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. వాటికి కొత్తగా రంగులు వేయించి ఫిట్నెస్ లేకుండా, ఎలాంటి అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకోవడంలోనూ పాఠశాలల యాజమన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
