రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం పలు మండలాల్లో రోడ్డెక్కారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్‌లో ధర్నా చేపట్టా

ల్పూర్/నస్రుల్లాబాద్/డిచ్పల్లి, జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం పలు మండలాల్లో రోడ్డెక్కారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా యాప్‌తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా, అవి ఆచరణకు నోచుకోవడంలేదని మండిపడ్డారు
