సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 196 పంచాయతీలకు 24 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 172 పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరిగే మొత్తం స్థానాల్లో సుమారు మూడింట ఒక వంతు స్థానాల్లో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుదారులు బరిలో ఉండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ గ్రూపుల గొడవ సదుమణిగింది అనుకున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో తిరిగి వర్గాలు బహిర్గతం అవుతున్నాయి.
