ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అందూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు దిక్కయ్యారు

బోథ్, జూలై 7 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అందూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు దిక్కయ్యారు. ఒకటి నుంచి ఐదు తరగతి వరకు 39 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది వరకు ఇక్కడ ఇ ద్దరు ఉపాధ్యాయులు పని చేస్తుండే వారు. గత జనవరి 3న ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉండడంతో గ్రామస్తులు అప్పట్లో సమావేశం ఏర్పాటు చేశారు.
