కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు బీఎల్వోలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. ప్రజలు, ఓటర్లకు అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు బీఎల్వోలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. ప్రజలు, ఓటర్లకు అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం వెరసి సర్ పక్రియలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పక్రియ మొదలై పది రోజులు దాటినా ఓటర్లకు పత్రాలు అందించలేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతోపాటు ఆ ఫారం నింపి ఇవ్వడంలో కూడా వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం చెబుతున్నా.. సరైనా ప్రచారం లేకపోవడంతో ఓటర్లలో గందరగోళం కనిపిస్తున్నది.
