2025లో కృత్రిమ మేధస్సు(ఏఐ)పై చాలామంది అభిప్రాయం ఒక్కటే.. దీనిని అంగీకరిస్తే మీ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. మానవ ఉద్యోగికి కంపెనీ చెల్లించాల్సిన దానికంటే ఏఐ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఏఐ ఉత్పాదకతను పది రెట్లు లేదా అంతకంటే ఎక్కువ పెంచుతుంది. కానీ 2026లో ఏఐ వాస్తవికత మరోలా ఉన్నది.

న్యూఢిల్లీ : 2025లో కృత్రిమ మేధస్సు(ఏఐ)పై చాలామంది అభిప్రాయం ఒక్కటే.. దీనిని అంగీకరిస్తే మీ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. మానవ ఉద్యోగికి కంపెనీ చెల్లించాల్సిన దానికంటే ఏఐ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఏఐ ఉత్పాదకతను పది రెట్లు లేదా అంతకంటే ఎక్కువ పెంచుతుంది. కానీ 2026లో ఏఐ వాస్తవికత మరోలా ఉన్నది. ఉత్పాదకత పది రెట్లు పెరుగడానికి బదులు ఏఐ ఖర్చు విపరీతంగా పెరిగింది. క్లాడ్ వంటి ఏఐ టూల్స్ ఉపయోగించడం కంటే సమర్థుడైన ఒక ఉద్యోగికి జీతం ఇవ్వడమే చౌక అని కొందరు పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ఏఐకి సంబంధించిన ఖర్చుల సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే మైక్రోసాఫ్ట్, ఉబర్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ ఏఐ ఖర్చులను సమర్థించుకోవడానికి కష్టపడుతున్నాయి.
