కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం(మే 28) సాయంత్రం 3 గంటలకు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

బెంగళూరు, మే 27 : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం(మే 28) సాయంత్రం 3 గంటలకు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన రాజీనామా సమర్పించడానికి గురువారం సాయంత్రం 3 గంటలకు ఆయన రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరినట్లు వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ అధిష్ఠాన వర్గంతో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఊహించిన ఈ చర్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి మార్గం సుగమం చేయనున్నది. కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సిద్ధరామయ్య తనకు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే కూడా బుధవారం ధృవీకరించారు.
