ఇరాన్‌వైపు అమెరికా యుద్ధనౌకలు.. వెనెజువెలా తరహాలో దాడికి అమెరికా సన్నాహాలు!
ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ చుట్టూ తన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నది.

న్యూఢిల్లీ, జనవరి 16: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ చుట్టూ తన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణించే అణు శక్తి సామర్థ్యమున్న యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక దక్షిణ చైనా సముద్రం నుంచి పశ్చిమాసియా వైపు పయనమైనట్లు తెలుస్తున్నది. ప్రపంచంలోనే అతి పెద్దది, అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకల్లో ఒకటైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికా నౌకాదళంలో కీలకపాత్ర పోషిస్తున్నది.
