తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ గుండాల మండలం అంబాల గ్రామ రైతుల ఆగ్రహా జ్వాలలను అధికారులు చవి చూడాల్సి వచ్చింది. గ్రామానికి చెందిన రైతులు మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గుండాల తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యానికి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు.

గుండాల, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ గుండాల మండలం అంబాల గ్రామ రైతుల ఆగ్రహా జ్వాలలను అధికారులు చవి చూడాల్సి వచ్చింది. గ్రామానికి చెందిన రైతులు మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గుండాల తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యానికి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో పోసి రెండు నెలలవుతున్నా కనీసం రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని అన్నారు. వారానికి కనీసం ఒక్క లారీ కూడా తమ గ్రామానికి రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
