పేదలకు ఉపయోగపడే వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు

మహబూబ్‌నగర్, జూన్ 2 ; బీఆర్ఎస్ హయాంలో పెండింగ్‌లో ఉన్న పనులను మళ్లీ శిలాఫలకాలు వేసి రిబ్బన్లు కట్ చేయడం కాదు.. పేదలకు ఉపయోగపడే వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను వెంటనే ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన, పక్కనే పెండింగ్‌లో ఉన్న టూరి జం ప్లాజా భవనాలను పరిశీలించారు.
