ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆర్ఎంపీలు, పీఎంపీలను గుప్పిట్లో పెట్టుకొని వైద్యంతో వ్యాపారం చేస్తున్నాయి. వాళ్ల రిఫరెన్స్‌తో ఆసుపత్రికి వచ్చే రోగి చెల్లించే బిల్లులో 20 శాతం నుంచి కొన్ని ఆసుపత్రులైతే 50 శాతం వరకు కమిషన్ ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది

మ పరిధిలోని గ్రామాల్లో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా.. తమకు కమిషన్ ఎక్కవగా ఇచ్చే ఆసుపత్రికి వెళ్లమంటూ రిఫర్ చేస్తున్నారు. నిత్యం చూసే ఆర్ఎంపీ చెప్పడంతో వారిపై నమ్మకంతో చెప్పిన ఆసుపత్రికి వెళ్లిన రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. వచ్చిన ఆసుపత్రిలో సరైన వైద్యులు, వైద్యసేవలు అందక ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తున్నది.
