నేరేడిగొండ మండలం బోథ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
