
దిల్సుఖ్నగర్, అక్టోబర్ 15 (శ్రీరామ్ చక్రీ న్యూస్ ): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతజయంతి 101 ఉత్సవాల్లో భాగంగా అష్టలక్ష్మి నగర్లో గురువారం పథసంచలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా అష్టలక్ష్మి దేవాలయం సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వయంసేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తిని చాటుతూ సాగిన పథసంచలన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంఘ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సమాజంలో సేవాభావం, సామాజిక సమరసత, జాతీయ ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్వర్ గంగాధర్, వక్తగా క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ను ఆహ్వానించారు. నగర సంపర్క్ ప్రముఖ్ చల్లా వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో స్వయంసేవకులు పాల్గొన్నారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన పథసంచలన్తో అష్టలక్ష్మి నగర్లో సందడి నెలకొంది.
