
చందన చెరువు, మంత్రల చెరువు వద్ద ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

(శ్రీరామ్ చక్రీ న్యూస్ ). హైదరాబాద్ 7.10.2026/బడంగ్పేట్ సర్కిల్/మీర్పేట్: రాబోయే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బతుకమ్మ ఘాట్ల వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని మహేశ్వరం ఎమ్మెల్యే, . సబితా ఇంద్రారెడ్డి, అధికారులకు సూచించారు.బుధవారం చందన చెరువు, మంత్రల చెరువు వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో పాటు బతుకమ్మ పండుగ ముందస్తు ఏర్పాట్లపై బడంగ్పేట్ సర్కిల్ డీసీ సమ్మయ్య, డీఈ హరిణి, ఎస్డబ్ల్యూఎం డీఈ రూపతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. చెరువుల వద్ద సుందరీకరణ, లైటింగ్, రోడ్ల మరమ్మతులు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.పండుగ నాటికి అన్ని పనులు పూర్తి చేసి, బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ మాజీ ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ నాయకులు భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ అధ్యక్షులు కామేష్ రెడ్డి, మాదారి రమేష్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మాజీ ధర్మకర్త, మాజీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ నాయక్, పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
