

(శ్రీరామ్ చక్రి న్యూస్)బడంగ్పేట్, జూన్ 17: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధి బడంగ్పేట్ డివిజన్లోని బాలాజీ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు అందించే విద్యాసంస్థలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు ఇలాంటి విద్యాసంస్థలు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు నిరుడు శ్రీరాములు, పగడాల ఉమేష్, నయనా చారి, కృష్ణ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, కొండ శ్రవణ్ కుమార్, మాస్టర్ మైండ్స్ డా. రామావత్ పాండు నాయక్, డా. సుభాష్ రాథోడ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
