మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక బలవర్ధకమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మొలకలు కూడా ఒకటి. పెసలు, పల్లీలు, శనగలు తదితర గింజలను నీటిలో నానబెట్టి వాటితో మొలకలను తయారు చేస్తారు.

మొలకలు చాలా బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. కానీ చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. మొలకలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మొలకలను చాలా మంది సాధారణంగా బయట కొంటుంటారు. కానీ కాస్త శ్రమిస్తే వీటిని ఇంట్లోనే మనం ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మొలకలను తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అన్ని రకాల గింజలను కొంత మోతాదులో తీసుకుని అన్నింటినీ కలిపి చాలా సులభంగా మొలకలను తయారు చేయవచ్చు.
