మాజీ కార్పొరేటర్ల పెత్తనంపై కిచ్చెన్న ఆగ్రహం
సప్తగిరి కాలనీకి త్వరలో రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు

తుక్కుగూడ, అక్టోబర్ 14 (శ్రీరామ్ చక్రి న్యూస్):
బడంగ్ పేట కార్పొరేషన్లో మాజీ కార్పొరేటర్లు ఇంకా పెత్తనం కొనసాగిస్తున్న తీరుపై మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తుక్కుగూడలోని కార్యాలయంలో శ్రీ సప్తగిరి కాలనీ నివాసితులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.

కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, ఆలయానికి వెళ్లే మార్గం లాంటి మౌలిక వసతులపై నివాసితులు సమస్యలు వినిపించారు. ఈ విషయాలపై మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని కేఎల్ఆర్ డిమాండ్ చేశారు.
“ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. మాజీ కార్పొరేటర్ల anyone అక్రమ వసూళ్లు చేస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయండి,” అని కిచ్చెన్న స్పష్టం చేశారు.
త్వరలోనే స్వయంగా సప్తగిరి కాలనీని సందర్శించి, అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని హామీ ఇచ్చారు.
