India Vs West Indies: విండీస్ బ్యాటర్లు హోప్, క్యాంప్‌బెల్ సెంచరీలు చేసి ఔటయ్యారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ ఆధిక్యం సాధించింది. క్యాంప్‌బెల్ 115, హోప్ 102 రన్స్ చేశారు.

న్యూఢిల్లీ: రెండో టెస్టు(India Vs West Indies)లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఫాలోఆన్ ఆడుతున్న విండీస్ జట్టు నాలుగో రోజు తొలి సెషన్లో కీలకమైన రన్స్ చేసింది. విండీస్ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్ సెంచరీ కొట్టాడు. జడేజా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టి తన ఖాతాలో సెంచరీ వేసుకున్నాడు. 174 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేశాడు
