బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. ఈ అంశంపై వీలైనంత త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి మాట్లాడానని, ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గౌడ్ చెప్పారు.

సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్య నేతల జూమ్ సమావేశం జరిగిందని పీసీసీ చీఫ్ తెలిపారు. ప్రభుత్వం వేసే పిటిషన్‌కు కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కూడా ఇన్ఫీల్డ్ అవుతారని అన్నారు.
