
(శ్రీరామ్ చక్రీ న్యూస్) AIMS లో మరోసారి సత్తచాటిన ఇండియన్ స్కూల్ విద్యార్థులు
ఆల్ ఇండియా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్ లో ఇండియన్ పాఠశాల విద్యార్థులు తమ సత్తాను చాటారు. p బాలకృష్ణ 9 వ తరగతి స్టేట్ లెవెల్ లో మూడవ ర్యాంకు A. వికాస్ 5వ తరగతి జోనల్ లెవెల్ లో రెండవ ర్యాంకు సాధించి అపెక్స్ వారు భారతీయ విద్యాభవన లో నిర్వహించిన ప్రోగ్రామ్ లో బంగారు మరియు వెండి పథకాలను అంద చేశారు. ఈ కార్యక్రమ లో కరస్పాండెంట్ నరేన్ దత్త ప్రిన్సిపాల్ భవన్ దత్త మాట్లాడుతూ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా తమ విద్యార్థులను ఎప్పుడూ ముందు వరసలో ఉంచుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
