
హైదరాబాద్: 23/9/2026 (శ్రీరామ్ చక్రీ న్యూస్)ప్రభావతి నగర్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. ఈ వేలంలో చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి రూ.85 వేలకు గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా జిన్నారం విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. లడ్డూ వేలంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రమణా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరహరి, ఎండీ జాఫర్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
