
మీర్ పేట్ :23/9/2026 (శ్రీరామ్ చక్రీ న్యూస్)
మీర్పేట్లోని టీఆర్ఆర్ టౌన్షిప్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. వేలంలో స్వామివారి లడ్డూ రూ.71 వేలు పలికింది. మంచన ప్రేమ్కుమార్–లక్ష్మి దంపతులు లడ్డూను కైవసం చేసుకున్నారు.స్వామివారి ఆశీస్సులతో తమ కుటుంబంతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టౌన్షిప్ వాసులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
