
ఎల్బీనగర్:23/9/2026 (శ్రీరామ్ చక్రీ న్యూస్) హనుమాన్‌నగర్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. హనుమాన్‌నగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది.గణనాథుడి లడ్డూ వేలంలో రూ.2,52,200 పలికింది. వనస్థలిపురానికి చెందిన అవిసా కన్స్ట్రక్షన్స్ అధినేత నెల్లికొండ సురేందర్‌రెడ్డి, ఉప్పల్‌కు చెందిన ఎంకేఎస్ లేడీస్ హాస్టల్ ప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో లడ్డూను దక్కించుకున్నారు.అదేవిధంగా నవరాత్రుల సందర్భంగా స్వామివారి మెడలో అలంకరించిన పవిత్ర కండువాను వేలం వేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన యాదాటి నాగమోహన్ రూ.45 వేలకు స్వామివారి కండువానుదక్కించుకున్నారు.హనుమాన్‌నగర్‌లో గత 18 ఏళ్లుగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేసి, నిత్యం ప్రత్యేక పూజలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గణనాథుడిని భారీ ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.
