సహజ సంపదను కొందరు కొల్లగొడుతున్నారు. ఇసుక, మొరం అక్రమ తవ్వకాలతో దోచుకుంటున్నారు. ధర్పల్లి మండలంలో ఈ దందా జోరుగా సాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుకాసురులకు అడ్డే లేకుండా పోతున్నది. ఇటీవల మైలారంలో చీతాఫోర్స్ దాడి చేసి అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రిప్పర్లను పట్టుకోవడమే అందుకు నిదర్శనం. మరోవైపు, ఇసుక కూడా ఇష్టమొచ్చినట్లు తరలించుకుపోతున్నారని స్థానికులు చెబుతున్నారు.

ధర్పల్లి, జూన్ 29: సహజ సంపదను కొందరు కొల్లగొడుతున్నారు. ఇసుక, మొరం అక్రమ తవ్వకాలతో దోచుకుంటున్నారు. ధర్పల్లి మండలంలో ఈ దందా జోరుగా సాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుకాసురులకు అడ్డే లేకుండా పోతున్నది. ఇటీవల మైలారంలో చీతాఫోర్స్ దాడి చేసి అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రిప్పర్లను పట్టుకోవడమే అందుకు నిదర్శనం. మరోవైపు, ఇసుక కూడా ఇష్టమొచ్చినట్లు తరలించుకుపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇండ్లు నిర్మించుకునే వారు మొరం, ఇసుక కోసం అనుమతులు అడిగితే నిబంధనల పేరిట తిప్పుతున్నారని, అదే అక్రమార్కులకు మాత్రం ఏ నిబంధనలు వర్తించవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
