వరుణుడు ముఖం చాటేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. ఇప్పటికే బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు కింద ఉన్న రైతులు నార్లు పోసుకున్నారు.

బాన్సువాడ, జూన్ 29: వరుణుడు ముఖం చాటేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. ఇప్పటికే బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు కింద ఉన్న రైతులు నార్లు పోసుకున్నారు. నాట్లు వేసే సమయం ఆసన్నమవుతున్న తరుణంలో సాగునీరు లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఏటా వానాకాలం ఆరంభంలోనే బాన్సువాడ ప్రాంత రైతులు ముందస్తుగా నారు పోస్తారు. అయితే, ఈసారి ఆశించిన మేర వర్షాలు లేకపోవడం, వానాకాలం ఆరంభమై నెల గడుస్తున్నా చిణుకు జాడ కరువవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు.
