చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి వ్యవసాయ భూమికి మట్టి తరలించేందుకు ఒక రైతు ఇరిగేషన్ ఏఈఈ ఎల్.శ్రీనివాసరావును సంప్రదించాడు.

అశ్వారావుపేట, జూన్ 29: చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వారావుపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి వ్యవసాయ భూమికి మట్టి తరలించేందుకు ఒక రైతు ఇరిగేషన్ ఏఈఈ ఎల్.శ్రీనివాసరావును సంప్రదించాడు. దీంతో మట్టి తరలించేందుకు రైతు వద్ద నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని బతిమిలాడగా రూ.2 లక్షలకు ఏఈఈ రైతుతో ఒప్పందం కుదుర్చుకున్నా
